ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) 1998లో ప్రవేశపెట్టిన వన్డే ఇంటర్నేషనల్ నాకౌట్ టోర్నీ. దీన్ని గతంలో ఐసీసీ నాకౌట్ టోర్నీగా పిలిచేవారు. ఈ టోర్నీని మొదట 1998లో బంగ్లాదేశ్‌లో విల్స్ ఇంటర్నేషనల్ కప్ పేరుతో నిర్వహించారు. ఈ టోర్నీని తర్వాత ఐసీసీ నాకౌట్ టోర్నీగా మార్చారు. 2002 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీగా మరోసారి పేరు మార్పు చేశారు. ఈ టోర్నీలో ఎనిమిది అగ్రశ్రేణి జట్లు మాత్రమే చేర్చారు. ఇందుకు సంబంధించి 2009లో రూల్స్‌ని ప్రవేశపెట్టారు. 2017 చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఆ తర్వాత ఈ ఐసీసీ టోర్నీని నిలిపివేశారు. 2021లో చాంపియన్స్ ట్రోఫీని 2025లో పాకిస్తాన్, 2029లో భారత్‌లో ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.