లాసానే: క్రికెట్లో కొత్త శకానికి నాంది పడిందని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నాడు. దాదాపు 128 ఏండ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్స్(లాస్ఎంజిల్స్ 2028)లో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) చీఫ్ థామస్ బాచ్‌తో జైషా ప్రత్యేకంగా భేటీ అయ్యాడు.
ఈనెల 30న లాసానేలో జరిగే కీలకమైన ఐవోసీ సెషన్‌కు ముందు పలు కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగిందని ఐసీసీ పేర్కొంది.