ICC Under 19 World Cup 2024: ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ షార్ట్‌లిస్ట్ ప్రకటించిన ఐసీసీ.. ముగ్గురు భారతీయులే..
ICC Under 19 World Cup 2024: మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలున్న అండర్ - 19 వరల్డ్ కప్ టోర్నీలో ఆద్యంతం రాణించిన ఆటగాళ్లకు అందజేసే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ జాబితాను ఐసీసీ ప్రకటించింది.
ICC Under 19 World Cup 2024: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్ టోర్నీ ముగింపు దశకు చేరుకున్నది. ఆదివారం (ఫిబ్రవరి 11న) భారత్ – ఆస్ట్రేలియాల మధ్య తుదిపోరుతో నెల రోజులుగా జరుగుతున్న ఈ టోర్నీకి ఎండ్‌కార్డ్ పడనుంది. మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలున్న ఈ మ్యాచ్‌లో ఆద్యంతం రాణించిన ఆటగాళ్లకు అందజేసే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ జాబితాను ప్రకటించింది. మొత్తం 8 మందిని ఇందుకోసం షార్ట్‌లిస్ట్ చేసింది. ఇందులో ముగ్గురు భారత్ నుంచే ఉండటం గమనార్హం.
ఐసీసీ ప్రకటించిన షార్ట్ లిస్ట్‌లో సౌతాఫ్రికా నుంచి క్వెన మఫక, పాకిస్తాన్ యువ సంచలనం ఉబేద్ షా, ఆసీస్ సారథి హ్యూగ్ వీబ్గన్, సఫారీ ప్లేయర్ స్టీవ్ స్టాక్, విండీస్ బ్యాటర్ జెవెల్ ఆండ్రూ ఉన్నారు. భారత్ నుంచి సౌమీ పాండే, ముషీర్ ఖాన్, కెప్టెన్ ఉదయ్ సహరన్ ఉన్నారు.
ఈ టోర్నీలో భారత సారథి ఉదయ్ సహరన్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. ఉదయ్.. 389 పరుగులు చేయడమే గాక ఒక వికెట్ తీశాడు. ఇండియా ఆల్‌రౌండర్ ముషీర్ ఖాన్ 338 పరుగులు చేసి బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీశాడు. స్పిన్నర్ సౌమీ పాండే ఆరు ఇన్నింగ్స్‌లలో 17 వికెట్లు తీశాడు.
8⃣ incredible performers, 1⃣ award 🏅
The shortlist for #U19WorldCup 2024 Player of the Tournament is out 👀 https://t.co/wx1gWrkXOZ
— ICC (@ICC) February 9, 2024
సఫారీ పేసర్ క్వెన మఫక.. 6 ఇన్నింగ్స్‌లలో 21 వికెట్లతో టోర్నీలో టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. పాక్ బౌలర్ ఉబేద్ షా ఆరు ఇన్నింగ్స్‌లలో 18 వికెట్లు పడగొట్టాడు. జెవెల్ ఆండ్రూ.. 4 ఇన్నింగ్స్‌లలోనే 207 రన్స్ చేశాడు. సఫారీ బ్యాటర్ స్టీవ్ స్టాక్ 6 ఇన్నింగ్స్‌లలో 228 పరుగులు సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

