ICC : కొలంబో టెస్టులో వరసగా ఆటగాళ్లు ఐసీసీ(ICC) ఆగ్రహానికి గురవుతున్నారు. ఇప్పటికే భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్, లంక పేసర్ అసితా ఫెర్నాండోలకు మ్యాచ్ ఫీజులో కోత విధించిన ఐసీసీ.. ఈసారి ప్రభాత జయసూర్య(Prabath Jayasuriya)పై కొరడా ఝులిపించింది. నియమావళిని ఉల్లంఘించినందుకు అతడికి ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది అత్యున్నత క్రికెట్ మండలి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన టెస్టు సిరీస్‌లో శ్రీలంక మరో క్రికెటర్ ఐసీసీ నియమావళిని ఉల్లంఘించి.. శిక్షకు గురయ్యాడు. స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ప్రభాత జయసూర్య ఐసీసీ ఆర్టికల్ 2.2 కోడ్‌ను ఉల్లంఘించాడు. రెండోరోజు టీమిండియా 503జ9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత.. బ్యాటింగ్‌కు దిగిన లంక చూస్తుండగానే రెండు వికెట్లు కోల్పోయింది. మానవ్ సుతార్ ఓవర్లో ఔటైన ప్రభాత.. పెవిలియన్‌కు వెళ్తూ.. బౌండరీ లైన్ దగ్గరి వెడ్జెస్‌ను బ్యాటుతో కొట్టాడు.
Nightwatchman sent packing! 🚶➡️
Manav Suthar strikes to pick up the wicket of Prabath Jayasuriya and wrap up the day on a high! 💥
Watch #SLvIND, 2nd Test, Day 3, Tomorrow, 9 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/pAKsoOncyK
— Sony Sports Network (@SonySportsNetwk) August 24, 2026
దాంతో.. అతడిపై ఐసీసీ రిఫరీ ఆండీ పైక్రాప్ట్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాడు. తన పొరపాటును లంక స్పిన్నర్ అంగీకరించాడు. గత 24 నెలల్లో ఇదే మొదటి తప్పిదం కావడంతో అతడిని క్షమాపణలు, ఒక డీమెరిట్ పాయింట్‌తో వదిలేసింది ఐసీసీ. ఇదే టెస్టులో.. తొలి రోజు మైదానంలో గొడవపడినందుకు భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్, లంక పేసర్ అసితా ఫెర్నాండోలు 25 శాతం మ్యాచ్ ఫీజు కోల్పోయారు. అంతేకాదు చెరొక డీ మెరిట్ పాయింట్ విధించింది ఐసీసీ.
🔴ICC ACTION AGAINST PRABATH JAYASURIYA 🤯
– Sri Lanka star Prabath Jayasuriya has been officially warned by the ICC after his emotional outburst during the 2nd Test vs India. 😳
– He was found guilty of abusing cricket equipment after striking the boundary wedges with his bat… pic.twitter.com/CcgbWOJyht
— Sam (@cricsam02) August 25, 2026