అందరికీ దీపావళి శుభాకాంక్షలు: విరాట్ కోహ్లీ
Virat Kohli | టీమిండియా వండర్ఫుల్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రతి ఒక్కరికీ
న్యూఢిల్లీ: టీమిండియా వండర్ఫుల్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రతి ఒక్కరికీ హ్యాప్పీ దీపావళి శుభాకాంక్షలని కోహ్లీ పేర్కొన్నాడు. అదేవిధంగా ఇవాళ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ గురించి విరాట్ మాట్లాడాడు. ఇవాళ పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్ తన అత్యుత్తమమైన ఇన్నింగ్స్‌లో ఒకటని చెప్పాడు.
ఇలాంటి ముఖ్యమైన గేమ్స్ ఆడటం తన అదృష్టమన్నాడు కోహ్లీ. ఇతర మ్యాచ్‌లతో పోల్చితే ఈ మ్యాచ్ చాలా భిన్నమైనదని తెలిపాడు. ఇవాళ పాకిస్థాన్ జట్టుపై తాము విజయం సాధించినందున దేశ ప్రజలంతా సంతోషంగా దీపావళి పండుగ జరుపుకుంటారని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ప్రస్తుతం సూపర్-12 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మొత్తం 12 జట్లు రెండు గ్రూప్‌లుగా సూపర్-12లో పోటీపడుతున్నాయి.
ఇవాళ టోర్నీలో తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడిన భారత్.. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఆఖరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ అజేయంగా 82 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

