Hardik Pandya | గాయమైనా ఐదు రోజుల్లో తిరిగొస్తానని చెప్పా.. కానీ..! హార్ధిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Hardik Pandya | టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 2023లో భారత్ వేదికగానే నిర్వహించిన వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లో కాలి మడమ గాయంతో ఇబ్బందిపడ్డ పాండ్యా.. ఆ తర్వాత టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
Hardik Pandya | ప్రస్తుతం ఐపీఎల్ – 17 ప్రిపరేషన్స్‌లో ఉన్న ఆ జట్టు సారథి, టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 2023లో భారత్ వేదికగానే నిర్వహించిన వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లో కాలి మడమ గాయంతో ఇబ్బందిపడ్డ పాండ్యా.. ఆ తర్వాత టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గాయం తీవ్రత నేపథ్యంలో అతడు వరల్డ్ కప్‌తో పాటు ఆ తర్వాత భారత్ ఆడిన మిగతా సిరీస్‌లకూ దూరంగా ఉన్నాడు. సుమారు ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ ఫీల్డ్‌లోకి అడుగుపెడుతున్న అతడు.. ఐపీఎల్ టీవీ ప్రసారహక్కులు కలిగిన ‘స్టార్’లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయం నుంచి ఐదారురోజుల్లో తిరిగొస్తానని టీమ్ మేనేజ్మెంట్కు చెప్పానని కానీ విధి మాత్రం మరోలా తలచిందని చెప్పుకొచ్చాడు.
పాండ్యా మాట్లాడుతూ.. ‘నేను వరల్డ్ కప్ కోసం ఏదో 2-3 నెలలుగా ప్రిపేర్ కాలేదు. సుమారు ఏడాదికాలంగా ప్రపంచకప్ కోసం సిద్ధమయ్యా. ఆ మేరకు నా షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకున్నా. కానీ గాయం మాత్రం నా ఆశలపై నీళ్లు చల్లింది. చాలా తక్కువ మందికి మాత్రమే నా గాయం గురించి తెలుసు. వాస్తవానికి నాకు గాయమైనప్పుడు 20-25 రోజుల్లో పూర్తిగా కోలుకుంటానని అనుకున్నా. కానీ అది నిత్యం వాయిదాపడుతూ నా రికవరీని లేట్ చేసింది. ఒకరకంగా చెప్పాలంటే నాకు ఇది పూర్తిగా కమ్ బ్యాక్ వంటిది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయమై నేను జట్టును వీడేప్పుడు టీమ్ మేనేజ్మెంట్తో ఐదు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పా. కానీ వరల్డ్ కప్‌తో పాటు నాలుగు నెలలు వేచి చూడాల్సి వచ్చింది..’ అని అన్నాడు.
అంతేగాక కాలి మడమ గాయం వల్ల తాను కనీసం నడవలేకపోయేవాడినని చెప్పిన పాండ్యా.. తాను వీలైనంత త్వరగా కోలుకునేందుకు చాలా కష్టపడ్డానని తెలిపాడు. నడక కష్టమైనా ఆ నొప్పి తెలియకుండా ఉండేందుకు గాను పెయిన్ కిల్లర్స్ వాడానని, ఇంజెక్షన్స్ కూడా తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. దేశం తరఫున ఆడటం ఎప్పుడూ గౌరవంగా భావించానని, కానీ వరల్డ్ కప్ మిస్ చేసుకున్నందుకు మాత్రం చాలా బాధపడ్డానని పాండ్యా తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

