Novac Djokovic : నిరుడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరం కావడం తన సక్సెస్‌కు కారణమని మాజీ వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ అన్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ ప్రారంభం కానున్న సందర్భంగా జకోవిచ్ అప్పటి వివాదంపై స్పందించాడు. ‘ఆ సమయంలో ప్రపంచానికి విలన్‌గా కనిపించాను. ఆ వివాదం తర్వాత కొన్ని నెలల పాటు టెన్నిస్ ఆడలేదు. ఆ టైమ్ నా శరీరాన్ని, ఆటను మెరుగు పరుచుకునేందుకు ఎంతగానో ఉపయోగపడింది. ఆ తర్వాత మరిన్ని విజయాలు సాధించాను. అయితే.. ఈసారి విలన్‌గా ఫీల్ కావడం లేదు’ అని జకోవిచ్ తెలిపాడు. కరోనా వ్యాక్సిన్ వేసుకోనందున పోయిన ఏడాది ఈ టోర్నీలో ఆడేందుకు నిర్వాహకులు అతడిని అనుమతించలేదు. ఏడో వింబుల్డన్ టైటిల్ సాధించాడు. అంతేకాదు ఏటీపీ టూర్ ఫైనల్లో ఆరోసారి విజేతగా నిలిచాడు.
పదో టైటిల్‌పై గురి
జనవరి 16న ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుంది. శుక్రవారం రాత్రి జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో నిక్ కిర్గియోస్‌తో జకోవిచ్ తలపడ్డాడు. స్టేడియంలో అతనికి ప్రేక్షకుల మద్దతు లభించింది. తొమ్మిది సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అయిన ఈ సెర్బియా స్టార్ పదో టైటిల్‌పై గురి పెట్టాడు. పురుషుల వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్, మహిళా క్రీడాకారిణి నవామి ఒసాకా ఈ టోర్నీనుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.