హైదరాబాద్, ఆట ప్రతినిధి : నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో నాలుగు రోజుల పాటు అలరించిన తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్‌షిప్ ఘనంగా ముగిసింది. హైదరాబాద్‌లోని ఉద్భవ్ పాఠశాలలో చదువుతున్న తనూజ కామేశ్వర్, దీక్షిత కొమురవెళ్లి పతకాల మోత మోగించారు. టోర్నీలో తనూజ.. మూడు స్వర్ణాలతో హ్యాట్రిక్ మెడల్స్ సాధించగా దీక్షిత ఓ స్వర్ణం, రెండు రజతాలు, కాంస్యం దక్కించుకుంది.