హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ఇండియా బాలికల జూనియర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ ప్లేయర్ స్నేహా రన్నరప్‌గా నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జగిన టోర్నీలో స్నేహా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ ప్రదర్శన కచ్చితంగా తన ప్రపంచ ర్యాంకింగ్స్ మెరుగయ్యేందుకు దోహదపడుతాయని స్నేహా పేర్కొంది. సెయింట్‌ఆన్స్ కాలేజీలో ప్రస్తుతం బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ యువ గోల్ఫర్ మూడు ప్రొ టైటిళ్లను దక్కించుకుంది. గత నవంబర్‌లో అబుదాబిలో జరిగిన ఆసియా మహిళల ఆసియా పసిఫిక్ టోర్నీలో భారత్ తరఫున స్నేహా ప్రాతినిధ్యం వహించింది.