బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్‌లో హైదరాబాదీ యువ షట్లర్ తరుణ్ మన్నెపల్లి మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. మంగళవారం ఇక్కడ జరిగిన క్వాలిఫయర్స్‌లో తరుణ్ 21-16, 21-19తో భారత్‌కే చెంది న మాజీ ప్రపంచ నంబర్‌వన్ కిదాంబి శ్రీకాంత్‌ను చిత్తు చేసి మెయిన్ డ్రాలో ప్రవేశించాడు.4
లాహోర్: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో కొత్త కోచ్ వచ్చాడు. గతంలో న్యూజిలాండ్ జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు డైరెక్టర్‌గా పని చేసిన మైక్ హెసెన్ను పాకిస్థాన్.. తమ హెడ్‌కోచ్‌గా నియమించింది.