హైదరాబాద్, ఆట ప్రతినిధి: మరో గ్రామీణ క్రీడ కార్పొరేట్ హంగులతో మన ముందుకు రాబోతున్నది. ఇప్పటికే కబడ్డీ లీగ్ దేశంలో అత్యంత ప్రాచు ర్యం పొందగా, తాజాగా గ్రామీణ యువత మక్కువ చూపించే వాలీబాల్ లీగ్ రూపంలో రానే వచ్చింది. శనివారం నుంచి స్థానిక గచ్చిబౌలి స్టేడియం వేదికగా ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్) తొలి సీజన్‌కు తెరలేవనుంది. ఏడు జట్ల సమాహారంతో వాలీబాల్ లీగ్ అభిమానులను అలరించేందుకు సర్వహంగులతో సిద్ధమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పూర్తి కట్టుదిట్టమైన బయోబబుల్ ఏర్పాట్ల మధ్య లీగ్‌ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్, కొచ్చి బ్లూ స్పైకర్స్ మధ్య లీగ్ తొలి మ్యాచ్ జరుగనుంది. రౌండ్‌రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే లీగ్‌లో ఈనెల 27న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.