Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Ranji Trophy: రంజీ మ్యాచ్‌లో తనయ్ త్యాగరాజన్ త్రిపురను దెబ్బతీశాడు. ఆ హైదరాబాదీ స్పిన్నర్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీయడంతో.. త్రిపుర ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ త్యాగరాజన్ తన ఖాతాలో మొత్తం 9 వికెట్లు వేసుకున్నాడు.
సికింద్రాబాద్: రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో హైదరాబాద్ జట్టు విక్టరీ కొట్టింది. గ్రూపు బీలో భాగంగా త్రిపురతో సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో సిరాజ్ సేన విజయాన్ని నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో త్రిపుర కేవలం 120 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాదీ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి త్రిపురను దెబ్బతీశాడు.
ఈ మ్యాచ్‌లో త్యాగరాజన్ మొత్తం తన ఖాతాలో 9 వికెట్లు వేసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అతను మూడు వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వికెట్లు దక్కని సిరాజ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు దక్కాయి. గ్రూపు బీలో తొలి మ్యాచ్ నెగ్గిన హైదరాబాద్ జట్టుకు ఏడు పాయింట్లు దక్కాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది.
తొలి రోజే త్రిపురను 134 పరుగులకు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేసిన సిరాజ్ సేన.. బ్యాటింగ్‌లో 294 రన్స్‌కు ఆలౌట్ అయి 160 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన త్రిపుర.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లకు 106/7 స్కోరు చేసింది. చివరి రోజు తొలి సెషన్లో కేవలం మరో 14 పరుగులు మాత్రమే జోడించి త్రిపుర ఓటమిపాలైంది.
Tanay Thyagarajan 6 WICKETS! (16.2-5-52-6), Tripura 120/10 #HYDvTPA #RanjiTrophy #Elite
— BCCI Domestic (@BCCIdomestic) October 13, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

