కరీంనగర్ కొత్తపల్లి, జనవరి 30 : హైదరాబాద్ మహిళల అండర్-19 బీ క్రికెట్ జట్టుకు కరీంనగర్ జిల్లాకు చెందిన కట్ట శ్రీవల్లి కెప్టెన్‌గా ఎంపికైంది. ఇదివరకు హైదరాబాద్ అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రీవల్లి ఇప్పుడు కెప్టెన్‌గా నియామకమైంది. ఫాస్ట్ బౌలర్‌గా తనదైన శైలిలో రాణిస్తున్న శ్రీవల్లి గతంలో అండర్-20జట్టుకు ప్రాతినిథ్యం వహించి ఆకట్టుకున్నది.
తాజాగా హెచ్సీఎ అండర్-19బీ జట్టును ప్రకటించగా, శ్రీవల్లిని కెప్టెన్‌గా నియమించినట్లు మహిళల సెలక్షన్స్ కమిటీ చైర్మన్ ప్రకటించారు. ఫిబ్రవరి 2నుంచి 10వరకు చండీగఢ్‌లో జరుగనున్న మ్యాచ్‌లకు శ్రీవల్లి కెప్టెన్‌గా వ్యహరించనున్నది.