చెన్నై : ఆలిండియా బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ విజేతగా హైదరాబాద్ నిలిచింది. చెన్నై వేదికగా టీఎన్‌సీఏ ప్రెసిడెంట్స్ లెవెన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను హైదరాబాద్ డ్రా చేసుకున్నా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఆ జట్టు టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్ పోరు తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 376 రన్స్‌కు ఆలౌట్ అవగా బదులుగా టీఎన్‌సీఏ 353 పరుగులకు కుప్పకూలింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్.. 155/5తో నాలుగో రోజు ఆటను ముగించింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో వరుణ్ గౌడ్ (56*), రాహుల్ రాధేశ్ (31*) ఆరో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ ఏకంగా 242 బంతులు ఎదుర్కుని టీఎన్‌సీఏ బౌలర్లను విసిగించారు. కాగా ఈ టోర్నీలో హైదరాబాద్‌కు ఇది ఆరో ట్రోఫీ కాగా వరుసగా రెండోవది కావడం విశేషం.