అమీర్‌పేట్, అక్టోబర్ 17: హైదరాబాద్ వేదికగా వీ4చెస్ ఆధ్వర్యంలో రెండు ఆలిండియా చెస్ టోర్నీలు జరుగనున్నాయి. సోమవారం బేగంపేట్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వీ4 చెస్ ప్రతినిధులు రాము, అమిత్‌పాల్ సింగ్, సర్దార్ రిష్పాల్సింగ్తో కలిసి రాష్ట్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఈ పోటీల్లో ‘సర్దార్ బిషన్‌సింగ్ మెమోరియల్ ఆలిండియా ఓపెన్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్’ను డిసెంబర్ 24 నుంచి 28 వరకు, రెండవదైన వి4 చెస్ ఆలిండియా ఓపెన్ ఫిడే రేటింగ్ టోర్నీ’ని ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ పోటీలు యూసుఫ్‌గూడ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు.