హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ సహజ యమ్లపల్లి వరుస విజయాల జోరు కొనసాగిస్తున్నది. షోలాపూర్ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీలో సహజ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
శనివారం జరిగిన మహిళల సింగిల్ సెమీస్లో సహజ 7-6(3), 6-2తో సాకి ఇకాముర(జపాన్)పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు ప్రదర్శించిన సహజ ప్రత్యర్థిని వరుస సెట్లలో మట్టికరిపించింది. ఆదివారం తుది పోరులో మకరోవాతో అమీతుమీ తేల్చుకోనుంది.