హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌ను హైదరాబాద్ జట్టు డ్రాతో ప్రారంభించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 400/7తో ఆట ఆరంభించిన హైదరాబాద్.. మరో 11 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీకి తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగుల ఆధిక్యం దక్కింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 138/3తో నాలుగో రోజును ముగించింది. మ్యాచ్‌ను డ్రాతో ముగించినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఢిల్లీకి కీలకమైన మూడు పాయింట్లు దక్కాయి.