సువొన్ (కొరియా): హైదరాబాదీ యువ షట్లర్ మేఘనా రెడ్డి కొరియా ఓపెన్లో మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్స్ పోటీల్లో 21 ఏండ్ల మేఘన.. తొలి రౌండ్లో 21-6, 21-18తో పై చు చెన్ (చైనీస్ తైపీ)ను చిత్తుగా ఓడించింది.
అనంతరం అదే జోరుతో 21-19, 22-20తో రిరిన హిరమొటొ (జపాన్)ను చిత్తుచేసి మెయిన్ డ్రాకు దూసుకెళ్లింది. తొలి రౌండ్లో మేఘన.. థాయ్లాండ్ షట్లర్ టొనుర్గ్ సెహెంగ్తో తలపడనుంది.