హుసేన్సాగర్ వేదికగా జరిగిన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్లో రితిక దంగీ మళ్లీ మెరిసింది. శనివారంతో ముగిసిన టోర్నీలో రితిక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మహిళల ఐఎల్సీఏ విభాగంలో బరిలోకి దిగిన ఈ ఐఎన్డబ్ల్యూటీసీ సెయిలర్ టైటిల్ విజేతగా నిలిచింది.
హైదరాబాద్ సెయిలింగ్ వీక్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుసేన్సాగర్ వేదికగా జరిగిన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్లో రితిక దంగీ మళ్లీ మెరిసింది. శనివారంతో ముగిసిన టోర్నీలో రితిక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మహిళల ఐఎల్సీఏ విభాగంలో బరిలోకి దిగిన ఈ ఐఎన్డబ్ల్యూటీసీ సెయిలర్ టైటిల్ విజేతగా నిలిచింది.
ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ ముందుకు సాగిన రితిక మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మరోవైపు ఐఎల్సీఏ-6 విభాగంలో ఈఎమ్ఈఎస్ఏకు చెందిన బిక్రమ్ మహాపాత్ర విజేతగా నిలిచాడు. ఐఎల్సీఏ-7లో మహాప్రభు, ఇస్రాజ్అలీ, మోహిత్సైనీ టైటిళ్లతో మెరిశారు. మిగతా విభాగాల్లో శశాంక్, ఏకలవ్య, అక్షత్కుమార్, షాగున్షా, మాన్యరెడ్డి ఆకట్టుకున్నారు.