హైదరాబాద్, ఆట ప్రతినిధి : సీఐఎస్సీఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రి సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ అండర్-17 బాలుర విభాగంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్ పీఎస్) బేగంపేట జట్టు విజేతగా నిలిచింది.
గురువారం గచ్చిబౌలిలోని నాసర్ స్కూల్ గ్రౌండ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హెచ్‌పీఎస్ జట్టు 4-0 గోల్స్ తేడాతో సెయింట్ పాట్రిక్ హైస్కూల్‌పై ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అబ్దుల్ కలాం రెండు గోల్స్ చేయగా, డానియల్, అభిరామ్ చెరో గోల్ కొట్టారు.