హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రిటోరియా(దక్షిణాఫ్రికా) వేదికగా జరిగిన ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్-జె60 టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ రిషితారెడ్డి సత్తాచాటింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో రిషిత 6-0, 6-1తో టాప్‌సీడ్ కైట్లిన్ రమ్దుత్పై విజయంతో టైటిల్ విజేతగా నిలిచింది.
ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన రిషిత..ప్రత్యర్థిని వరుస సెట్లలో మట్టికరిపించి ట్రోఫీని సొంతం చేసుకుంది.