హైదరాబాద్ : చెన్నైలో జరిగిన డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్‌లో రాణించిన యువ టేబుల్ టెన్నిస్ స్టార్, హైదరాబాద్‌కు చెందిన ఆర్. స్నేహిత్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-100లోకి దూసుకొచ్చాడు. ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్‌కు, డబుల్స్‌లో దిగ్గజ ఆటగాడు శరత్ కమల్‌తో కలిసి సెమీస్ చేరిన స్నేహిత్.. 34 స్థానాలు మెరుగుపరుచుకుని 89వ ర్యాంకుకు చేరాడు. ఇదే విషయమై స్నేహిత్ స్పందిస్తూ.. ‘టాప్-100లోకి రావడం ఈ ఏడాది నా లక్ష్యాల్లో ఒకటి. దానిని సాధించా. రాబోయే రోజుల్లో టాప్-50లో చేరడమే నా లక్ష్యం’ అని తెలిపాడు.