హైదరాబాద్, ఆట ప్రతినిధి : ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్) నాలుగో సీజన్‌కు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. స్థానిక గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా అక్టోబర్ 2వ తేది నుంచి లీగ్ మొదలుకానుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి శ్రీహరి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ యజమాని అభిషేక్‌రెడ్డి, సాట్స్ ఎండీ సోనీబాలదేవి పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే లీగ్‌లో మొత్తం 38 మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. లీగ్ మ్యాచ్‌లతో పాటె రెండు సెమీఫైనల్స్, ఫైనల్ కూడా ఇక్కడే జరుగనుంది. ఈ సీజన్లో గోవా గార్డియన్స్ రూపంలో కొత్త ఫ్రాంచైజీ అరంగేట్రం చేస్తుండటంతో జట్ల సంఖ్య పదికి చేరుకుంది.