హైదరాబాద్, ఆట ప్రతినిధి: దిండిగల్(తమిళనాడు) వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీ ఫైనల్లో హైదరాబాద్ భారీ ఆధిక్యం(517) దిశగా దూసుకెళుతున్నది. అనికేత్‌రెడ్డి (4/56), రోహిత్రాయుడు (3/36) ధాటికి చత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు కుప్పకూలింది. దీంతో 236 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన హైదరాబాద్‌ను జీవేశ్ (6/56) ధాటికి 281 పరుగులకు ఆలౌటైంది. రాహుల్‌సింగ్(68) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓవరాల్‌గా హైదరాబాద్ మ్యాచ్‌పై పట్టు కొనసాగిస్తున్నది.