హైదరాబాద్, ఆట ప్రతినిధి: యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియం వేదికగా జరగుతున్న తెలంగాణ ప్రొ బాస్కెట్‌బాల్ లీగ్(టీపీబీఎల్) తొలి సీజన్లో హైదరాబాద్ హనీబాడ్జర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం హోరాహోరీగా సాగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో హైదరాబాద్ హనీబాడ్జర్స్ 79-61తో రంగారెడ్డి రైజర్స్పై అద్భుత విజయం సాధించింది.
ఆది నుంచే తమదైన రీతిలో దూకుడు కనబరిచిన హైదరాబాద్..తొలి క్వార్టర్ నుంచే పాయింట్ల వేట కొనసాగించింది. ఈనెల 24న టీపీబీఎల్ ఫైనల్ పోరు జరుగుతుందని తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(టీబీఏ) అధ్యక్షుడు రావుల శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.