హెచ్ఎఫ్సీ సహకారం కోరిన సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గజ్వేల్‌లో ఫుట్‌బాల్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నదని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గజ్వేల్ సాకర్ అకాడమీ అభివృద్ధి కోసం సహకరించాలని హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) యాజమాన్యాన్ని ఆయన కోరారు. శనివారం హైదరాబాద్‌లో హెచ్ఎఫ్సీ ప్రతినిధులు వరుణ్ త్రిపురనేని, మెంటార్ సుశాన్‌ను వెంకటేశ్వర్‌రెడ్డి కలుసుకున్నారు. రాష్ట్రంలో ఫుట్‌బాల్ అభివృద్ధికి తగిన సహాయ, సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వరుణ్ పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే గజ్వేల్‌లో పర్యటించి అకాడమీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని వివరించారు. ఈ సందర్భంగా హెచ్ఎఫ్సీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు సాట్స్ చైర్మన్ మీడియాకు తెలిపారు.