Coconut Water | వేసవిలో రోజూ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఎన్నో లాభాలు.. ఒక నెల రోజుల పాటు ట్రై చేయండి..
కొబ్బరి నీళ్లు వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే సహజ పానీయంగా చాలా మంది తాగుతుంటారు. రుచితోపాటు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా కూడా ఇవి ప్రజాదరణ పొందాయి. అయితే రోజూ ఒక నెలపాటు కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో కొన్ని నెమ్మదిగా కనిపించే మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
Coconut Water | కొబ్బరి నీళ్లు వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే సహజ పానీయంగా చాలా మంది తాగుతుంటారు. రుచితోపాటు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా కూడా ఇవి ప్రజాదరణ పొందాయి. అయితే రోజూ ఒక నెలపాటు కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో కొన్ని నెమ్మదిగా కనిపించే మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఒక్కసారిగా కనిపించకపోయినా, క్రమంగా శరీరానికి ఉపశమనం, సమతుల్యతను అందిస్తాయని అంటున్నారు. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు సహజంగా ఉంటాయి. ఇవి శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. ముఖ్యంగా వేడి వాతావరణంలో రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం మరింత హైడ్రేటెడ్‌గా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యానికి మేలు..
పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల కండరాల పనితీరు, నరాల సంకేతాలు, గుండె ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని చెబుతున్నారు. శరీరంలో పొటాషియం లోపం ఉన్నవారికి ఇది సహజమైన మద్దతు అందిస్తుందని పేర్కొంటున్నారు. కొబ్బరి నీళ్లు తేలికగా జీర్ణమవుతాయి. కొంతమంది రోజూ తాగడం వల్ల కడుపు ఉబ్బరం లేదా భోజనం తరువాత భారంగా అనిపించడం తగ్గినట్టు గమనించవచ్చని నిపుణులు అంటున్నారు. ఇది ఆమ్లత్వం తక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. చక్కెర పానీయాలతో పోలిస్తే కొబ్బరి నీళ్లలో సహజ చక్కెర తక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరానికి తేలికపాటి శక్తిని అందిస్తూ, ఒక్కసారిగా షుగర్ పెరగకుండా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మధ్యాహ్న సమయంలో అలసట తగ్గి శరీరం కొంత ఉత్సాహంగా అనిపించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
చర్మ సంరక్షణకు..
తగినంత హైడ్రేషన్ వల్ల చర్మంపై కూడా ప్రభావం కనిపిస్తుంది. కొబ్బరి నీళ్లు శరీరానికి ద్రవాలను అందించడం ద్వారా చర్మం మసకబారినట్టు కనిపించడం తగ్గించి కొంత తేమగా కనిపించేందుకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు పండ్ల రసాలతో పోలిస్తే తక్కువ చక్కెర కలిగి ఉన్నప్పటికీ, పూర్తిగా షుగర్ లేనివి కావని వైద్యులు గుర్తు చేస్తున్నారు. సాధారణ పరిమితిలో రోజుకు ఒకసారి తాగడం ఆరోగ్యవంతులలో రక్తంలో చక్కెర స్థాయిలను పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చని చెబుతున్నారు. అయితే మధుమేహం ఉన్నవారు పరిమాణాన్ని నియంత్రించడం మంచిదని సూచిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన ఫలితాలు కనిపించకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరికి అధికంగా తాగితే పొటాషియం ఎక్కువై కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలని సూచిస్తున్నారు. రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అద్భుత మార్పులు జరగకపోయినా, శరీరం తేలికగా, తాజాగా, సమతుల్యంగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- coconut water
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

