Akhil Rabindra | చెన్నై: ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో తొలిరోజు నిరాశపరిచిన హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రెండోరోజు సత్తా చాటింది. ఈ పోటీలలో భాగంగా చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఆదివారం జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) మొదటి రౌండ్ రెండో రేసులో హైదరాబాద్ రేసర్ అఖిల్ రవీంద్ర రెండో స్థానంతో రన్నరప్‌గా నిలిచాడు.
27 నిమిషాల 19.810 సెకన్లలో రేసును పూర్తిచేసిన అతడు తృటిలో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. శ్రాచి బెంగాల్ టైగార్స్ డ్రైవర్ అలీస్టర్ యూంగ్.. 27 నిమిషాల 15.266 సెకన్లలో రేసును పూర్తిచేశాడు. గోవా ఏసెస్ జేఏ రేసింగ్ జట్టు డ్రైవర్ గాబ్రియెల్లా జిల్కోవా మూడో స్థానంలో నిలిచింది.