హైదరాబాద్, ఆట ప్రతినిధి: అక్టోబర్ 2 నుంచి నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఆరంభం కానున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ పోటీలకు ముఖ్య అతిథిగా రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ (హెచ్బీహెచ్) యజమాని అభిషేక్ కంకణాల కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బ్లాక్‌హాక్స్ గిఫ్ట్బాక్స్తో పాటు ప్రత్యేకంగా రూపొందించిన జెర్సీలు, క్యాప్‌లను అందించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకాటి శ్రీహరిని తమ కార్యాలయాల్లో కలిసిన అభిషేక్ వారిని పీవీఎల్‌కు హాజరుకావాలని కోరారు.