Pak Team | వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ హైదరాబాద్‌లో బుధవారం రాత్రి అడుగుపెట్టింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన పాక్ ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది. అపూర్వ స్వాగతానికి పాక్ ప్లేయర్లు భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. 2016 వరల్డ్ కప్ తర్వాద దాయాది జట్టు భారత్‌కు రావడం ఇదే తొలిసారి. పాక్ జట్టు హైదరాబాద్‌లో రెండు వామప్ మ్యాచ్‌లతో మరో రెండు మ్యాచ్‌లను ఆడనున్నది.
మెగా ఈవెంట్ కోసం వచ్చిన పాక్ టీమ్ సభ్యులకు హైదరాబాదీ స్పెషల్ మెనును ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన హైదరాబాదీ బిర్యాతో పాటు చికెన్, మటన్, ఫిష్ వైపు చూస్తున్నారు. గ్రిల్డ్ ల్యాంబ్ చాప్స్, మటన్ కర్రీ, బటర్ చికెన్, గ్రిల్డ్ ఫిష్ మెనూలో ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేకంగా స్టీమ్ బాస్మతి రైస్, బోలోగ్నీస్ సాస్‌తో కూడిన స్పాగెట్టి, వెజ్పులావ్ లాంటి పాక్ ప్లేయర్లు ఆర్డర్ చేశారు. ఇక పాక్ ప్లేయర్లు దాదాపు రెండువారాల పాటు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు.
శుక్రవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో పాక్ వామప్ మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్ కోసం గురువారం బాబార్ ఆజాం నేతృత్వంలో పాక్ జట్టు సాధన చేసింది. మంగళవారం ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్ ఆడనున్నది. ఇక వరల్డ్ కప్‌లో నెదర్లాండ్ జట్టుతో హైదరాబాద్‌లోనే తొలి మ్యాచ్‌ను ఆడబోతున్నది. ఇక ఏడేళ్ల తర్వాత వచ్చిన తొలిసారిగా భారత్‌కు వచ్చిన పాక్ జట్టులో ఇద్దరు మినహా అందరు ఆటగాళ్లు ఇది తొలి పర్యటన కావడం విశేషం. ప్రస్తుత పాక్ జట్టులో మహ్మద్ నవాజ్, సల్మాన్ అగా మాత్రమే గతంలో భారత్‌లో పర్యటించిన అనుభవం ఉన్నది.
First things first … lived up to the hype! pic.twitter.com/vmBuKjitaB
— Ahsan Iftikhar Nagi (@ahsannagi) September 27, 2023