న్యూఢిల్లీ: ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి మహర్దశ పట్టనుంది. స్వదేశం వేదికగా అక్టోబర్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం బీసీసీఐ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఎంపిక చేసిన ఐదు స్టేడియాల్లో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనుంది.
హైదరాబాద్ సహా ఢిల్లీ, కోల్‌కతా, మొహాలీ, ముంబై స్టేడియాల్లో బోర్డు అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఉప్పల్ స్టేడియానికి రూ.117 కోట్లు కేటాయించారు.