నేరేడ్మెట్, డిసెంబర్ 1: శ్రీ బాలాజి గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ అమీన్పూర్లో నిర్వహించిన డబ్ల్యూపీసీ తెలంగాణ నాలుగో ఓపెన్ స్టేట్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన యాప్రాల్‌కు చెందిన హువిస్క అరిమా అద్భుత ప్రతిభను ప్రదర్శించింది. అండర్ 13 కేటగిరిలో పోటీ చేసిన అరిమా నాలుగు సంవత్సరాల వయసులోనే 20కేజీల క్యాటగిరీలో రాష్ట్ర స్థాయి పతకాన్ని సాధించడం విశేషం.
ఈ సందర్భంగా పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ‘చిన్నారి అరిమా చిరుప్రాయంలోనే రాష్ట్ర స్థాయి వేదికపై విజయం సాధించడం నిజంగా గర్వకారణం. ఇది ఆమె క్రమశిక్షణ, ధైర్యం, మరియు పట్టుదలకి నిలువెత్తు నిదర్శనం.
ఇలాంటి ప్రతిభావంతుల పిల్లలు తెలంగాణ క్రీడారంగానికి భవిష్యుత్తులో మరింత పేరు తీసుకొస్తారని నమ్ముతున్నాను’ అని అన్నా రు. అరిమాను తీర్చిదిద్దిన కోచ్‌లకు, పోటీని విజయవంతంగా నిర్వహించిన టోర్నమెంట్ నిర్వాహకులకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న తల్లిదండ్రులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.