Yashasvi Jaiswal | మెల్బోర్న్: ఓపెనర్ జైస్వాల్ ఔట్‌పై వివాదం నెలకొన్నది. కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ క్యారీ క్యాచ్‌పై థర్డ్ అంపైర్ సైకత్ షర్ఫుదుల్లా నిర్ణయం దీనికి కారణమైంది. డ్రా కోసం ఆడుతున్న సమయంలో జైస్వాల్ క్యాచ్‌పై ఆన్‌ఫీల్డ్ అంపైర్ విల్సన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆసీస్ డీఆర్ఎస్కు వెళ్లింది. పలుమార్లు పరిశీలించిన అంపైర్ సైకత్..బంతి బ్యాట్‌ను తాకినట్లు స్నికోమీటర్లో కనిపించకపోయినా ఔట్ అని ప్రకటించాడు. దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు చీటర్ చీటర్ అంటూ పెద్దగా అరిచారు. దీన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌శుక్లా తీవ్రంగా తప్పుబట్టాడు.