జకార్తా: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. ఇండోనేషియా ఓపెన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-1000 పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో గురువారం ప్రణయ్ 21-11, 21-18తో లాంగ్ అంగూస్ విజయం సాధించాడు. ఇప్పటి వరకు కెరీర్లో ఒక్క టైటిల్ కూడా నెగ్గని 29 ఏండ్ల ప్రణయ్.. భారత బ్యాడ్మింటన్ జట్టు ఇటీవల ప్రతిష్ఠాత్మక థామస్ కప్‌ను తొలిసారి కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 10-21, 13-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ లీ జీ జియా చేతిలో పరాజయం పాలవగా.. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జంట నిరాశ పరిచింది. పురుషుల డబుల్స్‌లో అర్జున్-ధ్రువ్ జంట కూడా నిష్క్రమించింది.