హైదరాబాద్, ఆట ప్రతినిధి: దశాబ్ద కాలంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్రికెటర్ల భవిష్యత్‌ను సయ్యద్ అమీనుద్దీన్ అనే వ్యక్తి నాశనం చేస్తున్నాడని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ(హెచ్ఆర్సీసీ)..హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు ఫిర్యాదు చేసింది.
సొసైటీ నం 1911/1985 కింద హైదరాబాద్‌లో నమోదైన నల్లగొండ క్రికెట్ సంఘాన్ని సరైన పత్రాలు లేకుండా నల్లొండకు మార్చారని లేఖలో పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులు, బంధువుల పేర్లతో అనైతికంగా అసోసియేషన్ నడిపిస్తున్నారని తెలిపారు.