హైదరాబాద్, ఆట ప్రతినిధి: హాస్పిటల్ ప్రీమియర్ లీగ్(హెచ్పీఎల్) సీజన్-8లో వానర క్రికెట్ క్లబ్ విజేతగా నిలిచింది. గత రెండు నెలలుగా సాగిన టోర్నీలో వైద్యులు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. బుధవారం ఫైనల్లో స్టాలియన్స్ 11పై వానర సీసీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత స్టాలియన్స్ 19.3 ఓవర్లలో 114/10 స్కోరు ఆలౌటైంది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో వానర క్లబ్ 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. నీలగిరి శరత్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కించుకున్నాడు.