ముంబై: విరాట్ కోహ్లీనా మజాకా! తన అద్భుత ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్న విరాట్.. సోషల్‌మీడియాలోనూ తనదైన హవా కొనసాగిస్తున్నాడు. ఫామ్‌లేమితో గత మూడేండ్లుగా సెంచరీ మార్క్ అందుకోపోయినా.. కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడా లేని ఫాలోయింగ్ ఉంది. హాపర్‌హెచ్‌క్యూ డాట్ కామ్ లెక్కల ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ ఒక్కో స్పాన్సర్ పోస్ట్‌కు రూ.8.69 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఇలా పోస్ట్‌ల ద్వారా ప్రపంచంలో అధికంగా సంపాదిస్తున్న వారి జాబితాలో విరాట్ 14వ స్థానంలో ఉండగా, పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (రూ.19.13 కోట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. కైలీ జెన్నర్ (రూ.14.64 కోట్లు), లియోనల్ మెస్సీ (14.18 కోట్లు) రెండో, మూడో ర్యాంక్‌ల్లో ఉన్నారు.