న్యూఢిల్లీ: టీమిండియా టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలకు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా సోమవారం నమీబియాతో జరిగిన టీ20 మ్యాచ్.. కెప్టెన్‌గా అతనికి చివరిది. ఆ మ్యాచ్‌లో నిజానికి ఇండియా ఘన విజయాన్ని నమోదు చేసింది. కానీ వరల్డ్‌కప్ సెమీస్‌లోకి మాత్రం ఎంటర్ కాలేకపోయింది. అయితే ఇండియాకు విరాట్ కోహ్లీ 50 మ్యాచుల్లో టీ20 జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. కోహ్లీ నాయకత్వంలో ఇండియా 32 టీ20 మ్యాచ్‌లను గెలిచింది. మరో 16 మ్యాచ్‌లను ఓడిపోయింది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ఉండిపోయాయి. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. టెస్టులు, వన్డేలకు మాత్రం కోహ్లీనే పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా టీ20 మ్యాచ్‌లకు ఇక నుంచి కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ చేపడుతాడని కోహ్లీ నమీబియాతో మ్యాచ్‌లో అన్నాడు.
.@imVkohli signs off as the #TeamIndia T20I captain with a win. 🙌 🙌#T20WorldCup #INDvNAM pic.twitter.com/0YBK69rFhn
— BCCI (@BCCI) November 8, 2021