Disney+ Hotstar: వన్డే వరల్డ్‌కప్, ఆసియాకప్.. మొబైల్లో ఫ్రీగా లైవ్‌స్ట్రీమింగ్
Disney+ Hotstar : వన్డే వరల్డ్‌కప్, ఆసియాకప్.. మొబైల్లో ఫ్రీగా లైవ్‌స్ట్రీమింగ్ ఇవ్వనున్నారు. ఆ రెండు టోర్నీలకు చెందిన క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా ఇక మొబైల్లో చూడవచ్చు. డిస్నీ హాట్‌స్టార్ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.
హైదరాబాద్: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023, ఆసియా కప్ 2023 టోర్నీలు.. మొబైల్లో ఫ్రీగా లైవ్‌స్ట్రీమింగ్ ఇవ్వనున్నారు. ఈ రెండు టోర్నీలను ఇండియాలో ఉన్న క్రికెట్ అభిమానులు ఉచితం తమ మొబైల్లో చూసుకోవచ్చు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో సినిమాలో ఇటీవల ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా లైవ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో వరల్డ్ కప్‌తో పాటు ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్(Disney+ Hotstar)లో ఆ మ్యాచ్‌లు లైవ్ అవుతాయి.
మొబైల్ యూజర్లకు సబ్స్క్రిప్షన్ ఎత్తివేయడం వల్ల ఈ రెండు టోర్నీలను ఇండియాలో అదనంగా దాదాపు 54 కోట్ల మంది ఉచితం చూసే అవకాశం దక్కుతుంది. మొబైల్ వాడకందారులకు తమ ఫ్లాట్‌ఫామ్ అందుబాటులో ఉండేందుకు డిస్నీ హాట్‌స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనున్నది. సెప్టెంబర్ 2 నుంచి 13 వరకు ఆసియాకప్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

