న్యూఢిల్లీ : క్రికెట్ వరల్డ్ కప్ (Cricket World Cup Final) తుది అంకానికి చేరడంతో మ్యాచ్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. అహ్మదాబాద్‌లో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రేక్షకాభిమానుల నుంచి విపరీతమైన డిమాండ్ నెలకొంది. మ్యాచ్ జరిగే రోజు రాత్రి హోటల్ రూంలకు డిమాండ్ ఎగబాకడంతో హోటల్ టారిఫ్‌లు భగ్గుమంటున్నాయి. మ్యాచ్ జరిగే రోజు నైట్ స్టేకు అహ్మదాబాద్‌లోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్‌లో రూం టారిఫ్స్ ఏకంగా రూ 2 లక్షలు పలుకుతున్నాయి.
ఇక ఇతర హోటల్స్ సైతం తమ టారిఫ్స్‌ను ఐదు నుంచి ఏడు రెట్లు పెంచేశాయి. వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్ నుంచే కాకుండా దుబాయ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల నుంచి కూడా ప్రేక్షకులు తరలివచ్చి మ్యాచ్‌ను చూసేందుకు క్యూ కడుతున్నారు. అహ్మదాబాద్‌లో త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్‌లో దాదాపు 5000 రూంలు ఉన్నాయి. నరేంద్ర మోదీ స్టేడియం కెపాసిటీ 1.2 లక్షల మంది కాగా, తాము 30,000 నుంచి 40,000 మంది వరకూ ఇతర ప్రాంతాల నుంచి మ్యాచ్‌ను వీక్షించేందుకు వస్తారని అంచనా వేస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ గుజరాత్ అధ్యక్షుడు నరేంద్ర సోమాని తెలిపారు.
హోటల్ రూంలకు డిమాండ్ పెరగడంతో రేట్లు కూడా పెరిగాయని చెప్పారు. గతంలో సాధారణ రేట్లకు లభ్యమయ్యే హోటల్ రూంలు ప్రస్తుతం రూ. 50,000 నుంచి రూ. 1.25 లక్షలు పలుకుతున్నాయని తెలిపారు. హోటల్స్ బుకింగ్ చేసుకునే ముందు ప్రజలు విమాన టికెట్లను బుక్ చేసుకుంటున్నారని, దీంతో అహ్మదాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల పట్టణాల్లోనూ హోటల్ రూంల రేట్లు విపరీతంగా పెరిగాయని తెలిపారు.
ఫైవ్ స్టార్ హోటల్స్‌కు సంబందించి వివిధ హోటల్ బుకింగ్ సైట్స్‌లో ఆన్లైన్ రేట్లు ఒక రాత్రికి రూ. 2 లక్షలకు చేరకున్నాయి. మ్యాచ్ జరిగే రాత్రి ఐటీసీ నర్మద, హయత్ రీజెన్సీ హోటల్ రూంలు ఆన్లైన్లో రూ. 2 లక్షలు మించాయి. నాన్ స్టార్ హోటల్ రూంలు సైతం ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు టారిఫ్‌లను ఐదు నుంచి ఏడు రెట్లు పెంచేశాయి.
Read More :
Leopards | నాసిక్ వీధుల్లో పట్టపగలే చిరుతల సంచారం.. భయాందోళనలో ప్రజలు