అహ్మదాబాద్ : తొలి ప్రపంచ యోగాసన చాంపియన్షిప్లో ఆతిథ్య భారత్ అదరగొడుతున్నది. పోటీల మొదటి రోజు శుక్రవారం వేర్వేరు విభాగాల్లో ఐదు పసిడి పతకాలతో మెరిసింది. ఏకా ఎరీనా వేదికగా జరుగుతున్న పోటీల్లో భారత యెగాసన ప్లేయర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత్ తరఫున అభయ్ బర్మన్, రితూ మొండల్ తొలి స్వర్ణాలు అందించారు.
మహిళల సీనియర్-ఏ విభాగంలో రీతూ ఠాకూర్, పురుషుల సీనియర్-బీ కేటగిరీలో రోషన్ తాపా, మహిళల సీనియర్-బీలో జ్యోతి దేవుర్కర్ స్వర్ణా లు కైవసం చేసుకున్నారు.