Asia Cup 2025 : అసియా కప్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న అఫ్గినిస్థాన్ మొదటి వికెట్ కోల్పోయింది. డేంజరస్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్జాబ్ (8) ఔటయ్యాడు. హాకాంగ్ పేసర్ ఆయుశ్ శుక్లా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన అతడు మిడాఫ్‌లో నిజాకత్ ఖాన్‌కు దొరికిపోయాడు. దాంతో, 25 పరుగుల వద్ద అఫ్గన్ జట్టు తొలి వికెట్ పడింది. ప్రస్తుతం ఓపెనర్ సెదీఖుల్లా అటల్(17 నాటౌట్), ఇబ్రహీం జద్రాన్(1 నాటౌట్) ఆడుతున్నారు. మూడు ఓవర్లకు కాబూలీ జట్టు స్కోర్.. 26/1.
అబూదాబీలోని షేక్ జయద్ స్టేడియం వేదికగా జరుతున్న తొలి పోరులో కాబూలీ టీమ్ సారథి రషీద్ ఖాన్ టాస్ గెలిచాడు. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే లక్ష్యంతో అతడు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతడి అంచనాలను నిజం చేస్తూ ఓపెనర్ సెదీఖుల్లా అటల్ (17 నాటౌట్) తొలి ఓవర్లోనే మూడు బౌండరీలతో రెచ్చిపోయాడు.
Ayush Shukla dismisses Gurbaz with a fullish delivery, miscued shot caught brilliantly by Nizakat Khan #TOKSports #TOKInAsiaCup #AFGvHK pic.twitter.com/B6qK2b50ZU
— TOK Sports (@TOKSports021) September 9, 2025
అతీక్ ఇక్బాల్ వేసిన రెండో ఓవర్లో బౌండరీతో స్కోర్ వేగం పెంచాడు. అనంతరం ఆయుశ్ శుక్లా వేసిన మూడో ఓవర్ తొలి బంతిని రహ్మనుల్లా గుర్బాజ్(8) సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతిని సిక్సర్ కొట్టబోయిన అతడు టైమింగ్ కుదరక మిడాఫ్‌లో నిజాకత్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో.. హాంకాంగ్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు.