న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తున్న పుల్లెల గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జంట హాంకాంగ్ ఓపెన్లో బోణీ కొట్టింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మంగళవారం గాయత్రి-త్రిసా జోడీ 21-15, 16-21, 21-16తో డెబోరా జిల్లి-చెరిల్ ద్వయంపై విజయం సాధించింది.
మరోవైపు ఇటీవల ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ నెగ్గిన భారత యువ షట్లర్ కిరణ్ జార్జ్.. ఈ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపోయాడు.