ముంబై : ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తమ సహాయ సిబ్బంది జహీర్ ఖాన్, మహేల జయవర్ధనేకు ప్రమోషన్ కల్పించింది. ఇప్పటివరకు భారత్కు పరిమితమైన వీరి సేవలు ఇకపై ప్రపంచ వ్యాప్తం కానున్నాయి. అత్యంత విలువైన క్రికెట్ ఫ్రాంచైజీగా పేరొందిన ముంబై ఇండియన్స్.. దక్షిణాఫ్రికా, యూఏఈలలో వచ్చే యేడాది నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆయా జట్ల అభివృద్ధి కోసం జయవర్ధనేను ‘గ్లోబల్ హెడ్ ఆఫ్ ఫెర్ఫార్మెన్స్’, జహీర్ఖాన్ను ‘గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్మెంట్’గా నియమించింది.