WI vs SA : సొంతగడ్డపై జరుగుతున్న రెండో టెస్టులోనూ వెస్టిండీస్ (West Indies) బ్యాటర్లు తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా(South Africa) బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు. విజృంభిండంతో ఆతిథ్య జట్టు 144 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(54 నాటౌట్) అర్ధ శతకంతో రాణించగా కేసీ కార్టీ(26) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో షమర్ జోసెఫ్(25) మెరుపులతో విండీస్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. సఫారీ పేసర్లు మల్డర్(4/32), నంద్రె బర్గర్(3/49)లు అద్భుతంగా బౌలింగ్ చేసి పర్యాటక జట్టుకు 16 పరుగుల ఆధిక్యాన్ని అందించారు.
గయాన వేదికగా సాగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను తక్కువకే కట్టడి చేసిన ఆనందం విండీస్‌కు లేకుండా పోయింది. మొదటి టెస్టు వైఫల్యం నుంచి పాఠాలు నేర్వని విండీస్ వీరులు మరోసారి చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే మల్డర్, బర్గర్ల జోరుతో వెస్టిండీస్‌కు కష్టాలు మొదలయ్యాయి. టాపార్డర్‌లో క్రెగ్ బ్రాత్‌వైట్(3), మేకిలె లూయిస్(0)లు విఫలమయ్యారు.
👏 Jason Holder with the only fifty of the Test so far
🔥 4 fours and a six for Shamar JosephAfter West Indies’ counter-attack against South Africa, which team is ahead in this match? 🤔 https://t.co/PchR2SCx8c #WIvSA pic.twitter.com/hkdcB5bu36
— ESPNcricinfo (@ESPNcricinfo) August 16, 2024
ఆ తర్వాత కేసీ కార్టీ(26) రాణించినా అతడికి అండగా నిలిచేవాళ్లు కరువయ్యారు. ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(54 నాటౌట్) ఓవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేశాడు. టెయిలెండర్లతో విలువైన పరుగుల జోడించి జట్టు స్కోర్ 100 దాటించాడు. ఆఖర్లో షమర్ జోసెఫ్(25) అండగా మరో భాగస్వామ్యం నెలకొల్పాడు. ధాటిగా ఆడిన షమర్‌ను కేశవ్ మహరాజ్ ఎల్బీగా ఔట్ చేసి కరీబియన్ జట్టు ఇన్నింగ్స్‌కు తెరదించాడు.