KSCA : కర్నాటక క్రికెట్ సంఘం ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న జరగాల్సిన ఎన్నికలు డిసెంబర్ ఆఖరుకు వాయిదా పడగా.. డిసెంబర్ 7న ఎన్నికలకు జరపాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయయూర్తి పర్యవేక్షణలో ఎలక్షన్స్ నిర్వహించాలని కేఎస్‌సీఏకు స్పష్టం చేసింది. ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ బీకే రవి, కర్నాటక క్రికెట్ సంఘం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుభాష్ బి.అడి కర్నరాటక క్రికెట్ సంఘం ఎన్నికల బాధ్యత తీసుకోనున్నారు.
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న కర్నాటక క్రికెట్ సంఘానికి ఎన్నికలు జరగాలి. కానీ, ఎన్నికల నిర్వహణాధికారి డాక్టర్.బి. బసవరాజు (మాజీ ఐఏఎస్) క్రికెట్ సంఘం నిర్వహణ కమిటీ నుంచి స్పష్టత లేదని.. వెంటనే కోర్టు జోక్యం చేసుకోవాలని పట్టుపట్టారు. దాంతో.. మరో పదమూడు రోజుల్లో జరగాల్సిన ఎన్నికలు వచ్చే నెలాఖరుకు వాయిదా పడినట్టు ఒక కర్నాటక క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకోవాలని ఇరువురు పిటిషన్లు వేశారు. శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ సూరజ్ గోవిందరాజు డిసెంబర్ 7న ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ನಿವೃತ್ತ ನ್ಯಾಯಮೂರ್ತಿ ಸುಭಾಷ್ ಅಡಿ ಮೇಲುಸ್ತುವಾರಿಯಲ್ಲಿ ಡಿ.7ಕ್ಕೆ ಕೆಎಸ್ಸಿಎ ಚುನಾವಣೆ ನಡೆಸಲು ಹೈಕೋರ್ಟ್ ಆದೇಶ #KarnatakaHighCourt #KSCA #election https://t.co/RC1C6yIZq4
— ಬಾರ್ & ಬೆಂಚ್ – Kannada Bar & Bench (@Kbarandbench) November 21, 2025
‘కర్నాటక క్రికెట్ సంఘం నియమాలకు లోబడి ఎన్నికలు నిర్వహించాలి. క్యాలండర్ ఈవెంట్లను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అంతరాయాలకు ప్రభావితం కాకుండా ఎన్నికలు జరపాలి. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ బి డిసెంబర్ 7న జరిగే ఎన్నికలను పర్యవేక్షిస్తారు’ అని జస్టిస్ సూరజ్ గోవిందరాజు పేర్కొన్నారు.
ఎన్నికలు వాయిదా పడడానికి కర్నాటక క్రికెట్ సంఘం స్పందించకపోవడమే కారణమని తెలుస్తోంది. డాక్టర్ బసవరాజు ఏం చెబుతున్నాడంటే.. ‘నేను నవంబర్ 14న క్రికెట్ అసోసియేషన్‌కు లేఖ రాశాను. పలు అంశాలపై ప్రశ్నలు సంధిస్తూ, ఎన్నికల విధివిధానాలకు సంబంధించిన ప్రక్రియను తెలపాలని ఆ లేఖలో కోరాను. కానీ, మూడు రోజులకు అంటే సోమవారం వారి నుంచి రిప్లై వచ్చింది. అది కూడా పాక్షిక సమాచారంతో. అందుకే వచ్చే నెల వరకూ కోర్టు విధించిన ఆదేశాలు అమలులో ఉంటాయి. అంతర్గత విబేధాలను చట్టపరమైంగా పరిష్కరించుకోవాలి. అప్పుడే ఎన్నికలు జరపడం మంచిది. అందుకు డిసెంబర్ 30 వరకు సమయం ఉంది’ అని ఆయన పేర్కొన్నాడు.