చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది.
ముంబై ఇండియన్స్‌తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో
విజయం సాధించింది. 138 పరుగుల ఛేదనలో ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి మరో ఐదు బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకుంది. శిఖర్ ధావన్(45: 42 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్), స్టీవ్
స్మిత్(33: 29 బంతుల్లో 4ఫోర్లు), లలిత్ యాదవ్(22 నాటౌట్: 25 బంతుల్లో 1ఫోర్) రాణించడంతో ఢిల్లీ గెలుపొందింది. చివర్లో హెట్‌మైర్(14 నాటౌట్: 9 బంతుల్లో 2ఫోర్లు) రెండు ఫోర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా వికెట్ కాపాడుకుంటూ ధావన్, స్మిత్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ముంబై బౌలర్లలో జయంత్ యాదవ్, బుమ్రా, రాహుల్ చాహర్, పొలార్డ్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ(44: 30 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్(24), ఇషాన్ కిషన్(26), జయంత్ యాదవ్(23) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. డికాక్(1), హార్దిక్ పాండ్య(0), కృనాల్ పాండ్య(1), పొలార్డ్(2) విఫలమయ్యారు. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా(4/24) ముంబైని వణికించాడు. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా స్టాయినీస్, రబాడ, లలిత్ యాదవ్ తలో వికెట్ తీశారు.
That's that from Match 13 of #VIVOIPL as @DelhiCapitals win by 6 wickets to register their third win of the season.
— IndianPremierLeague (@IPL) April 20, 2021
Scorecard – https://t.co/XxDr4f4nPU #DCvMI pic.twitter.com/g3bqYZTl6f