Swapna Barman | తెలంగాణ హెప్టాథ్లెట్ నందిని అగసారా ట్రాన్స్‌జెండర్ అంటూ ఆమె టీమ్ మేట్ సంచలన కామెంట్స్
Swapna Barman | చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో మహిళా హెప్టాథ్లాన్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన తెలంగాణ హెప్టాథ్లెట్ నందిని అగసారాపై ఆమె టీమ్ మేట్, పశ్చిమబెంగాల్ హెప్టాథ్లెట్ స్వప్ప బర్మన్ సంచలన కామెంట్స్ చేసింది.
హాంగ్జౌ: చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో మహిళా హెప్టాథ్లాన్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన తెలంగాణ హెప్టాథ్లెట్ నందిని అగసారాపై ఆమె టీమ్ మేట్, పశ్చిమబెంగాల్ హెప్టాథ్లెట్ స్వప్ప బర్మన్ సంచలన కామెంట్స్ చేసింది. నందిని ట్రాన్స్జండర్ అని, ఆమె తనకు రావాల్సిన పతకాన్ని ఎగరేసుకుపోయిందని ఆరోపించింది.
ఆ మేరకు స్వప్న బర్మన్ ట్విటర్ (X)లో ఓ పోస్టు పెట్టింది. ‘చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో నేను నాకు రావాల్సిన కాంస్య పతకాన్ని ఓ ట్రాన్స్‌జెండర్‌కు వదులుకోవాల్సి వచ్చింది. అథ్లెటిక్స్ రూల్స్‌కు విరుద్ధమైనా నేను నా మెడల్‌ను వెనక్కి ఇచ్చేయాలని కోరుతున్నా. దయచేసి నాకు సహాయం చేయండి, మద్దతు తెలియజేయండి’ అని స్వప్న ట్వీట్ చేశారు.
నందిని అగసారా పేరును ప్రస్తావించకుండానే ఆమెను ఉద్దేశించి ట్వీట్ చేసిన స్వప్న బర్మన్.. ఏమైందో ఏమోగానీ ఆ తర్వాత ఆ పోస్టును డిలీట్ చేసింది. కాగా, మహిళల హెప్టాథ్లాన్ ఫైనల్స్‌లో నందిని అగసారా 5712 పాయింట్లతో మూడో స్థానంలో నిలువగా, స్వప్న బర్మన్ 5708 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కాగా, స్వప్న బర్మన్ 2018 ఆసియా క్రీడల్లో ఇదే విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

