SLW vs AUSW : మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వరుణుడు (Rain) వరుసగా ఆటంకం కలిగిస్తున్నాడు. టోర్నీ ప్రారంభంలోనే భారత్, శ్రీలంక పోరుకు అడ్డుపడిన వర్షం ఈసారి కొలంబోలో ప్రతాపం చూపిస్తోంది. దాంతో ఆతిథ్య శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్ టాస్ ఆలస్యం అవుతోంది. సరిగా టాస్ సమయానికి ముందే ప్రేమదాస స్టేడియం (Premadasa Ground)లో చినుకులు మొదలయ్యాయి.
కాసేపటికి తగ్గడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ కుండపోత కురిపిస్తున్నాడు వరుణుడు. ఇప్పటికే సాయంత్రం 5:00 గంటలు కావొస్తున్నా వర్షం మాత్రం తగ్గడం లేదు దాంతో… ఈ మ్యాచ్‌లో కూడా 50 ఓవర్లకు కొన్ని కుదించే అవకాశముంది. మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్లు భారత్, శ్రీలంక మ్యాచ్ కూడా వర్షం కారణంగా రెండు ఓవర్లు కుదించారు. డక్‌వర్త్ లూయిస్ (DLS) ప్రకారం జరిగిన ఆ గేమ్‌లో టీమిండియా 59 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
It’s not looking good in Colombo 😔#SLvAUS updates: https://t.co/TC4pPLxeOq pic.twitter.com/8kEJUZqAJB
— ESPNcricinfo (@ESPNcricinfo) October 4, 2025
ఏడుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌ను ఘనంగా ఆరంభించింది. తమ మొదటి మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. భారీ విజయంతో ఆసీస్ జోరు మీదుండగా.. సొంతగడ్డపై బోణీ కొట్టాలని చమరి ఆటపట్టు బృందం పట్టుదలతో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు.