BANW vs ENGW : వరల్డ్ కప్‌లో ఏకపక్ష మ్యాచ్‌లతో బోర్ కొట్టిన అభిమానులకు ఇంగ్లండ్(England), బంగ్లాదేశ్(Bangladesh) మ్యాచ్ థ్రిల్‌నిచ్చింది. ఉత్కంఠగా సాగిన పోరులో హీథర్ నైట్ (79 నాటౌట్) ఒంటిచేత్తో జట్టును గెలిపించింది. చేసింది స్వల్ప స్కో్రే అయినా గొప్పగా పోరాడిన బంగ్లా ఫేవరెట్ ఇంగ్లండ్‌ను ఓడించినంత పనిచేసింది. మరుఫా అక్తర్(2-28), మహిమా (3-16)లు వికెట్ల వేటతో మాజీ ఛాంపియన్‌ను వణికించారు. దాంతో.. 30 ఓవర్ల లోపే ముగుస్తుందనుకున్న మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అయితే.. నాట్ సీవర్ బ్రంట్ జతగా నైట్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆరు వికెట్లు పడినా సరే.. ప్రశాంతంగా ఆడిన తను.. చార్లీ డీన్(27 నాటౌట్)తో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్‌కు 4 వికెట్ల విజయాన్ని అందించింది.
వరల్డ్ కప్‌లో అదిరే బోణీ కొట్టిన ఇంగ్లండ్ రెండో మ్యాచ్‌లో అతికష్టమ్మీద గట్టెక్కింది. దక్షిణాఫ్రికాను 69కే కట్టడి చేసిన ఇంగ్లండ్ .. బంగ్లాదేశ్ నిర్దేశించిన 179 పరుగుల ఛేదనలో మాత్రం అపసోపాలు పడింది. గువాహటి వేదికగా ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో బంగ్లాదేశ్ కొద్దిలో చరిత్ర సృష్టించే అవకాశాన్ని చేజార్చుకుంది. మరుఫా అక్తర్(2-28), మహిమా (3-16)ల విజృంభణతో ఒకదశలో ఆరువికెట్లు తీసి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టిన బంగ్లా బౌలర్లు.. ఆ తర్వాత ప్రభావం చూపలేకపోయారు.
Saved by the TV umpire on 0, 8, and 13, Heather Knight’s experience clinches England the win in a tricky chase against Bangladesh 👊 #CWC25 pic.twitter.com/Q44t0SCXAL
— ESPNcricinfo (@ESPNcricinfo) October 7, 2025
కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (32) సహాప్రధాన బ్యాటర్లు పెవిలియన్ చేరగా.. విజయానికి 74 రన్స్ అవసరమైన వేళ హీథర్ నైట్ (79 నాటౌట్) నింపాదిగా, ప్రశాంతంగా ఆడింది. చార్లీ డీన్ (27 నాటౌట్) చక్కని సహకారం అందించగా.. బౌండరీలతో చెలరేగిన నైట్ ప్రపంచకప్‌లో తమకు షాకివ్వాలనుకున్న బంగ్లా ఆశలపై నీళ్లు చల్లింది.
వరల్డ్ కప్ 8వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 180 లోపే కట్టడి చేసిన ఇంగ్లండ్ ఛేదనలో తడబడుతోంది. మొదటి ఓవర్లోనే మరుఫా అక్తర్ సూపర్ డెలివరీతో ఓపెనర్ అమీ జోన్స్(1)ను ఎల్బీగా వెనక్కి పంపింది. అనంతరం.. నహిదా అక్తర్ ఓవర్లో టమ్మీ బ్యూమంట్ (7 నాటౌట్) కూడా ఔటయ్యేది. ఆఫ్‌సైడ్ డిన బంతిని క్యాచ్ అందుకోలేకపోయింది మరుఫా. ఒకవేళ ఆ క్యాచ్ పట్టిఉంటే 6 పరుగుల వద్దే ఇంగ్లండ్ రెండో వికెట్ కూడా పడేది.
Marufa’s on fire – both England openers gone in 6.1 overs! 🔥
🔗 https://t.co/dRk1F6lLvq | #CWC25 pic.twitter.com/A59CyRn4DI
— ESPNcricinfo (@ESPNcricinfo) October 7, 2025
లైఫ్ లభించడంతో బతికిపోయిన బ్యూమంట్ కాసేపటికే మరుఫా ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగింది. ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత నాట్ సీవర్ బ్రంట్(32), హీథర్ నైట్(79 నాటౌట్)లు ఆచితూచి ఆడారు. మరుఫా ఓవర్లో ఎల్బీఅప్పీల్తో వికెట్ కాపాడుకున్న బ్రంట్ ఆ తర్వాత మూడు ఫోర్లతో చెలరేగింది. కానీ, పదో ఓవర్ తర్వాత.. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇరువురు పెద్ద షాట్లకు యత్నించలేదు.
క్రీజులో పాతుకుపోయిన బ్రంట్, నైట్ ఇంగ్లండ్‌ను గెలుపు దిశగా నడిపిస్తున్న వేళ మహిహా ఖాతూన్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. 19వ ఓవర్లో తను వరుస బంతుల్లో బ్రంట్, సోఫీ డంక్లే(0)ను డకౌట్‌గా వెనక్కి పంపింది. ఆ తర్వాత ఎమ్మా లాంబ్(1)ను సైతం ఔట్ చేసి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలో పడేసింది. కానీ, అలిసే క్యాప్స్(22) జతగా నైట్ మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పి స్కోర్ వంద దాటించింది. కానీ, మగ్లా ఓవర్లో క్యాప్సే ఎల్బీగా ఔట్ కావడంతో బంగ్లా విజయంపై ఆశలు చిగురించాయి.
A superb spell by Bangladesh legspinner Fahima Khatun made England sweat 👏 #CWC25 pic.twitter.com/TMhPQlFxyd
— ESPNcricinfo (@ESPNcricinfo) October 7, 2025
అయితే.. చార్లీ డీన్ (27 నాటౌట్) అండగా నైట్ జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకొని.. బంగ్లా స్పిన్నర్లపై ఎదురుదాడి చేసింది. పేసర్ మరుఫా గాయంతో మైదానంలోకి రాకపోవడం బంగ్లా అవకాశాల్ని దెబ్బతీసింది. డీన్ చక్కగా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ విజయంలో కీలకమైంది. 47వ ఓవర్ తొలి బంతిని ఆమె బౌండరీకి పంపగా ఇంగ్లండ్ నాలుగు వికెట్లతో గెలుపొందింది. ఒకవేళ బంగ్లా మరో 30-40 రన్స్ చేసి ఉంటే ఇంగ్లండ్‌ను నిలువరించేది.
ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి టాపార్డర్ విఫలం కాగా బంగ్లాదేశ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఇంగ్లిష్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్న శోభన మొస్త్రే(60) అర్ధ శతకంతో రాణించింది. ఆఖర్లో రబెయా ఖాన్(43) మెరుపులతో బంగ్లా కోలుకుంది. స్మిత్ వేసిన చివరి ఓవర్లో రబెయా సిక్స్, ఫోర్ బాది హాప్ సెంచరీకి చేరువైంది. కానీ, షజిందా అక్తర్ ఔట్ కావడంతో 178కే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది.
Sobhana Mostary’s first international fifty held Bangladesh together while Rabeya Khan’s late cameo lifted them to 178 – can they make it a tricky chase for England?
🔗 https://t.co/dRk1F6ldFS | #CWC25 pic.twitter.com/JCKRD6qmbD
— ESPNcricinfo (@ESPNcricinfo) October 7, 2025